హార్ముజ్ ద‌గ్గ‌ర మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌.. షిప్‌పై ఇరాన్ అటాక్!

by velandi.Saikiran |

అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య ఇటీవల శాంతి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే.

హార్ముజ్ ద‌గ్గ‌ర మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌.. షిప్‌పై ఇరాన్ అటాక్!
X

దిశ‌, వెబ్ డెస్క్: అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య ఇటీవల శాంతి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా హర్మూజ్ జలసంధి గుండా నౌకలు సాఫీగా ప్రయాణిస్తున్నాయి. ఎలాంటి గొడవలు లేకపోవడంతో, ఇండియాకు కూడా చాలా నౌకలు వస్తున్నాయి. హర్మూజ్ జలసంధి మార్గం క్లియర్ చేసుకుని.. భారత్‌కు చెందిన మ‌రో 30 నౌకలు వస్తున్నట్లు స‌మాచారం. అయితే, శాంతి ఒప్పందం ను బ్రేక్ చేస్తూ హర్మూజ్ జలసంధిని దాటుతున్న సింగపూర్ షిప్ పై ఇరాన్ దాడి చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ అధికారికంగా వెల్లడించింది. తాము నిర్దేశించిన మాటల్లో వెళ్ళని షిప్స్ పై యాక్షన్ తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇందులో భాగంగానే IRGC దాడులు చేయడం మొదలుపెట్టింది. అయితే దీనిపై ఇప్పటి వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్పందించలేదు. దాడి జరిగినట్లుగా గుర్తించలేదు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story