- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యథేచ్ఛగా ఫుట్‌పాత్ ల ఆక్రమణ
ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోటల్ యజమాను లు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపా ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

దిశ, ఖైరతాబాద్ : ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోటల్ యజమాను లు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపా ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. హోటళ్లకు సంబంధించిన వాహ నాల పార్కింగ్‌ను ఫుట్‌పాత్‌లపై ఏ ర్పాటు చేయడంతో ప్రజలు నడిచేందుకు స్థలం లేక రోడ్డుపైనే ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరేమో ఫుట్ పాత్‌లను ఆక్రమించి అక్రమంగా చిన్నచిన్న బడ్డీ కొట్లు ఏ ర్పాటు చేసుకుంటున్నారు. ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్న అధికారుల కు, స్థానికంగా ఉండే చోటామోటా లీడర్లకు ప్రతి నెలా ముడుపులు చెల్లిం చాల్సిందే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుట్‌పాత్‌లు పూర్తిగా ఆక్రమణకు గురికావడంతో చిన్నారులు, వృ ద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగి వాహనదారులకు కూడా సమస్యలు తలెత్తుతున్నా యి. పాదచారులు రోడ్డుపై నడవాల్సి రావడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మామూళ్ల పర్వం..
ఫుట్‌పాత్ ఆక్రమణలపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరు హోటల్ యజమానుల నుం చి మామూళ్లు అందుతున్న కారణంగానే అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఫుట్‌పాత్ ఆక్రమణలను వెం టనే తొలగించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటల్ యజమానులపై క ఠిన చర్యలు తీసుకోవాలని స్థాని కులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఈ హోటళ్లతో ఇబ్బందులు..
అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, మైత్రి వనం, బల్కంపేట ప్రధాన రహదారులు నిత్యం వాహనాదారులతో రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి రద్దీ ప్రాం తాన్ని అదునుగ చే సుకుని అమీర్పేట లోని సత్యం థియేటర్ రహదారిపై ఉ న్న అమోఘ, ఆనందోబ్రహ్మ, హరి దోష హోటళ్లు ఫుట్ పాత్ లను ఆక్ర మించి వ్యాపారం చేస్తున్నాయి. బల్కంపే ట ఎల్లమ్మ ఆలయ సమీప రోడ్డులోని మేఫీల్ హోటల్, ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ నుంచి బీకే కూడా వైపు గుమగుమలు, లక్ష్మీ నర సింహ హోటళ్లు సొంత లాభాల కోసం ప్రజలను, వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఇష్టానుసారం గా వ్యవహరిస్తున్న హోటల్ యాజమాన్యాలను ఫుట్ పాతులను ఆక్రమిస్తు న్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీ సుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






