- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసలు సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారు.. సీఎం రేవంత్‌కు హరీష్‌రావు కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రాంరభ సంబరాలకు బదులుగా రేవంత్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఎక్స్ వేధికగా వరుస ప్రశ్నలు వేశారు. కర్నాటక ప్రాజెక్టుల వల్ల తెలంగాణ నీటిహక్కులకు నష్టం కలుగుతుందని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రాంరభ సంబరాలకు బదులుగా రేవంత్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఎక్స్ వేధికగా వరుస ప్రశ్నలు వేశారు. కర్నాటక ప్రాజెక్టుల వల్ల తెలంగాణ నీటిహక్కులకు నష్టం కలుగుతుందని అన్నారు. RDS నీటి కేటాయింపులపై స్పష్టమైన హామీలు సాధించారా.. అని ప్రశ్నించారు. తెలంగాణకు 15.90 టీఎంసీల హక్కు సాధించారా.. అని అడిగారు. RDS ద్వారా 5 టీఎంసీలకు మించి తెలంగాణకు నీరు రాలేదని చెప్పారు. ఏపీ అదనపు నీటి వినియోగాన్ని సీఎం ప్రశ్నించలేదని విమర్శించారు.
అంతేకాకుండా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై స్పష్టత ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కేసీ కాలువ కోసం సుంకేసుల వద్ద సుమారు 39 టీఎంసీల నీటిని వినియోగిస్తూనే ఉందని అన్నారు. దీనికి అదనంగా కర్ణాటకతో కుదిరి ఒప్పందం ద్వారా కేసీ కాలువ కోసం ఉద్దేశించిన దాదాపు 10 టీఎంసీల నదీ జలాలను ఆర్‌బీహెచ్‌ఎల్‌సీ మరియు ఆర్‌బీఎల్‌ఎల్‌సీలకు మళ్లిస్తున్నారని విమర్శించారు. దీనివల్ల తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని అన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నారని అడిగారు. కేవలం రాజకీయ ప్రచారం కోసమే ఈ హడావిడి అని మండిపడ్డారు.






