- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాటలకందని పేదరికం.. పాడె మోసేందుకు నలుగురు లేక.. వృద్ధురాలి మృతదేహాన్ని..
జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. చరమాంకంలో మనల్ని మోసేందుకు నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలంటారు పెద్దలు.

దిశ, వెబ్ డెస్క్: జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. చరమాంకంలో మనల్ని మోసేందుకు నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలంటారు పెద్దలు. ఇలాంటి ఘటనలు చూసినపుడు కళ్లు చమర్చడమే కాదు. మానవత్వం మరీ అంతలా నశించిపోయిందా అని కోపం కూడా వస్తుంది. మోయడానికి నలుగురు మనుషులు, తరలించేందుకు ఒక వాహనం లేక చివరికి ఆ వృద్ధురాలి మనవడు, కుమార్తె కలిసి భౌతిక కాయాన్ని సైకిల్ పై కట్టుకుని తీసుకెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బరగఢ్ జిల్లా పైకమాల్ బ్లాక్ పరిధిలోని కంటాపడ గ్రామానికి చెందిన జయంతి బచ్చా అనే వృద్ధమహిళ అనారోగ్యంతో గురువారం ఉదయం మరణించింది. 8 నెలల క్రితమే కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం మగదిక్కు లేనిదయింది. నిరుపేద కుటుంబం కావడంతో.. వృద్ధురాలు చనిపోయాక ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు, పాడె మోసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రభుత్వ క్రిమేషన్ వెహికల్స్ కూడా సమయానికి అందుబాటులో లేవు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె మనవడు శుభమ్ బచ్చా, కుమార్తె వాసంతి బచ్చా, కోడలు యజ్ఞాసిని కలిసి పాత సైకిల్ పై మృతదేహాన్ని కట్టి.. దానిని నెట్టుకుంటూ శ్మశానానికి తరలించారు. ఈ ఘటన చూసిన కొందరు స్థానికులు చలించి.. అంత్యక్రియలు పూర్తిచేసేందుకు సహాయం చేశారు.






