- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి పండుగల రైతు ఆశీర్వాద సభ.
చింతకాని మండలం లో ఈ నెల 30 న తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి అనుముల రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ స్థలాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేసి మాట్లాడుతూ.. రైతులకు ఈ సభ నుండి ఒకేసారి 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు అని తెలిపారు

దిశ చింతకాని : చింతకాని మండలం లో ఈ నెల 30 న తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రి అనుముల రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ లో పాల్గొననున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సభ స్థలాన్ని గురువారం పరిశీలించి అధికారులకు సూచనలు చేసి మాట్లాడుతూ రైతులకు ఈ సభ నుండి ఒకేసారి 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు అని తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలోనే రైతులు పండించిన వరి,మొక్కజొన్న పంట ప్రతి గింజని ప్రభుత్వమే కొని రైతులను ఆదుకున్నది అన్నారు.పంట మార్పిడి విధానాన్ని అమలు చేసి అత్యధిక పంటను పండించాలి మరియు భూసారం పెంచుకోవాలి అని రైతులు సూచించారు.ఎరువులు యూరియాని పదివేల మెట్రిక్ టన్నులు కేంద్రం నుంచి ఈ సంవత్సరానికి అనుమతి తెచ్చుకున్నాము అని అందులో 5000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ వచ్చి ఉన్నది అని రైతులు ఎటువంటి ఆందోళన పడవద్దు అని ఈ ఖరీఫ్ కు సరిపోను యూరియా మన దగ్గర ఉందని అని భరోసా ఇచ్చినారు.రైతులు అప్డేట్ అయ్యి యూరియాని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల ఎలాంటి దళ్లారుల చేతుల్లో,మార్కెట్ వాళ్ళ చేతుల్లో మోసపోకుండా ఉంటారు.ఒకేసారి మూడు ఎకరాలు ఉన్న చిన్న రైతులు వ్యవసాయ మార్కెట్ కి వచ్చి తీసుకెళ్లే విధంగా యాప్ ను అప్డేట్ చేస్తామని చెప్పినారు.
దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎరువులు కొరకు ప్రధానమంత్రి దగ్గరికి వచ్చిన దాఖలు లేవు కానీ మన ముఖ్యమంత్రి ఇప్పటికి రెండుసార్లు ప్రధానమంత్రి మోడీని కలిసి మన రాష్ట్రానికి కావలసిన ఎరువులను యూరియాని అడిగి తీసుకొచ్చినారు అని రైతులకు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినట్టు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ నియోజకవర్గంలోని మరియు ఈ జిల్లాలోని రైతులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక మొత్తంలో జన సమీకరణ చేసి సీఎం బహిరంగ సభను భారీ మొత్తంలో విజయవంతం చేయాలని కోరినారు.ఈనెల 28,29,30న ఈ బహిరంగ సభ ప్రాంతంలోనే 150 స్టాల్స్ లను రైతులకు వ్యవసాయం కొరకు అన్ని పంటలకు సంబంధించిన సైంటిస్టులను తీసుకొని వచ్చి రైతులు పంటలు పండించటములో మెలుకువలు నేర్పుతారు.మరియు వారికి వచ్చే డౌట్లను తీర్చి పంటలు అధిక మొత్తంలో దిగుబడు రావడానికి సూచనలు సలహాలు ఇస్తారు.కాబట్టి రైతులు ఈ మూడు రోజులు 150 స్టాళ్లలో తిరిగి వారికి పంట మీద ఉన్న అనుమానాలను తీర్చుకోవాలని,మరియు పశుసంవర్ధస శాఖకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కావున ఈ మూడు రోజులు రైతులు పెద్ద మొత్తంలో ఒక సంక్రాంతి పండుగ లాగా జరుపుకొని పంటల్లో వారికి వచ్చే డౌట్లను పూర్తిగా తెలుసుకొని పంటను అధిక మొత్తంలో పండించే విధంగా తెలుసుకోవాలని కోరినారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ మరియు ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నూతి సత్యనారాయణ, మరియు గిడ్డంగుల చైర్మన్ రాయల్ నాగేశ్వరావు ,మరియు పూవాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్,మత్కేపల్లి ఏఎంసీ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు,కొప్పుల గోవిందరావు,కూరపాటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.






