ప్రైవేట్ ఉద్యోగులకు అలర్ట్.. మూడు రోజుల పాటు ఈపీఎఫ్‌ పోర్టల్ సేవలు నిలిపివేత

by Ramesh Naini |   (  Updated:2026-06-25 16:41:40  IST  )

ఈపీఎఫ్‌వో సభ్యులకు కీలక సమాచారం. జూన్ 26 అర్ధరాత్రి నుంచి జూన్ 28 రాత్రి వరకు సభ్యుల పోర్టల్‌లోని పలు సేవలు అందుబాటులో ఉండవు.

ప్రైవేట్ ఉద్యోగులకు అలర్ట్.. మూడు రోజుల పాటు ఈపీఎఫ్‌ పోర్టల్ సేవలు నిలిపివేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈపీఎఫ్‌వో (Employees' Provident Fund Organisation) సభ్యులకు కీలక సమాచారం. క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ వ్యవస్థను మరింత వేగవంతం, సమర్థవంతంగా మార్చేందుకు ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్, డేటాబేస్ సమీకరణ పనులు చేపడుతోంది. దీంతో జూన్ 26 అర్ధరాత్రి నుంచి జూన్ 28 రాత్రి వరకు సభ్యుల పోర్టల్‌లోని పలు సేవలు అందుబాటులో ఉండవు. ఈ మూడు రోజుల పాటు కొత్త ఈపీఎఫ్ క్లెయిమ్‌లు, నగదు ఉపసంహరణలు, ఖాతాల బదిలీ వంటి సేవలను ఆన్‌లైన్‌లో దాఖలు చేయడం సాధ్యం కాదు. ఇప్పటికే సమర్పించిన క్లెయిమ్‌లు రద్దు కావని, అయితే వాటి పరిష్కారంలో స్వల్ప జాప్యం ఉండొచ్చని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. జూన్ 29 నుంచి సేవలు యథావిధిగా పునరుద్ధరించబడతాయని తెలిపింది. భవిష్యత్తులో వేగవంతమైన, భద్రమైన సేవలందించేందుకు ఈ మార్పులు చేపడుతున్నట్లు పేర్కొంది. సభ్యులు సహాయం కోసం ఈపీఎఫ్‌వో హెల్ప్‌లైన్ 14470ను సంప్రదించవచ్చు.

Next Story