రూ.16.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

by Ratna Kumari |

మున్సిపాలిటీ పరిధిలో రూ.16 కోట్ల 25 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు.

రూ.16.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
X

దిశ, చండూరు : మున్సిపాలిటీ పరిధిలో రూ.16 కోట్ల 25 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి సెంట్రల్ డివైడర్‌లో మొక్కలు నాటారు. అనంతరం చండూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మార్కెట్ కార్యాలయ నూతన భవనానికి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డ్ ఆవరణలో భవన నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని పరిశీలించి, భవన నిర్మాణంపై అధికారులు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. అలాగే, చండూరు మండల వ్యాప్తంగా మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ గృహాలను నిర్మించుకోలేని లబ్ధిదారుల స్థానంలో అదే గ్రామాలకు చెందిన నిరుపేదలకు చండూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో 20 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ గృహాల మంజూరు పత్రాలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పంపిణీ చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన మేకల సాగర్ రెడ్డి, ఐతరాజు మల్లేష్లకు నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ బూతరాజు దశరథ, మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, వైస్ చైర్మన్ పోలు వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story