- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EPFO: ఈపీఎఫ్ చందాదారులకు కీలక అలర్ట్
ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవల నాణ్యతను పెంచడంతో పాటు భవిష్యత్తులో క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను మరింత వేగవంతం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను చేపట్టింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఈపీఎఫ్ చందాదారులకు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలన్నా లేదా పింఛన్ నిధులను బదిలీ చేయాలన్నా ఈ వారం కొంచెం ఓపిక పట్టక తప్పదు. ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ సేవల నాణ్యతను పెంచడంతో పాటు భవిష్యత్తులో క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను మరింత వేగవంతం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను చేపట్టింది. తన క్లెయిమ్ ప్రాసెసింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో జూన్ 26 అర్ధరాత్రి నుంచి జూన్ 28 రాత్రి వరకు మెంబర్ పోర్టల్‌లోని కీలక సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సమయంలో కొత్త పీఎఫ్ విత్‌డ్రా, బదిలీ లేదా ఇతర క్లెయిమ్‌లను సమర్పించడం సాధ్యం కాదు. ఇప్పటికే దాఖలైన క్లెయిమ్‌లు రద్దు కావు, అయితే వాటి ప్రాసెసింగ్‌లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. జూన్ 29 నుంచి అన్ని సేవలు సాధారణంగా పునరుద్ధరించబడతాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. భవిష్యత్తులో క్లెయిమ్‌లను మరింత వేగంగా, సురక్షితంగా ప్రాసెస్ చేయడానికి ఈ అప్‌గ్రేడ్ చేపడుతున్నట్లు సంస్థ పేర్కొంది. అత్యవసర సహాయం కోసం సభ్యులు 14470 హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని వెల్లడించింది.






