- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై 5 నుండి టీజీలాసెట్, పీజీఎల్ సెట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్, టీజీ పీజీఎల్ సెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి గాను మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ లాసెట్, టీజీ పీజీఎల్ సెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు టీజీ సెట్స్ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎల్‌ఎల్‌బీ కోర్సుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 5 నుండి, ఎల్‌ఎల్‌ఎమ్ కోర్సుల వెరిఫికేషన్ జులై 27 నుండి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://lawcetadm.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని కన్వీనర్ తెలిపారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్:
వివరాలు టీజీలాసెట్( ఎల్ఎల్ బీ3,5 ఏళ్లు) పీజీఎల్ సెట్ (ఎల్ఎల్ఎం)
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు జులై 5 నుండి 10 వరకు జులై 27 నుండి 31 వరకు
ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల వెరిఫికేషన్ జులై 6 నుండి 9 వరకు జులై 29 నుండి 31 వరకు
అర్హులైన అభ్యర్థుల జాబితా జులై 15 ఆగస్టు8
వెబ్ ఆప్షన్ల నమోదు(ఫేజ్1) జులై 16 నుండి 19 వరకు ఆగస్టు1 నుండి 2 వరకు
వెబ్ఆప్షన్ల సవరణ జులై 20 ఆగస్టు3
సీట్ల కేటాయింపు(ఫేజ్1) జులై 24 ఆగస్టు5
కాలేజీల్లో రిపోర్టింగ్ జులై 25నుండి 28 వరకు ఆగస్టు 5 నుండి 8 వరకు






