‘హిట్‌- 3’ రికార్డు.. వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా.. వైరల్ అవుతున్న నాని వైల్డ్ పోస్టర్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-05-05 13:02:54  IST  )

న్యాచురల్ స్టార్ నాని(Nani), డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) కాంబోలో వచ్చిన hit-3 సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది.

‘హిట్‌- 3’ రికార్డు.. వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా.. వైరల్ అవుతున్న నాని వైల్డ్ పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: న్యాచురల్ స్టార్ నాని(Nani), డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) కాంబోలో వచ్చిన hit-3 సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో నాని సరసన శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) కథానాయికగా నటించింది. మే 1న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే భారీ వసూళ్లతో సత్తా చాటుతుంది.

నాలుగు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత కూడా దూసుకుపోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. ‘సర్కార్ సెంచరీ దాటేశాడు.. నాలుగు రోజుల్లోనే రూ.101 కోట్ల గ్రాస్ వసూలు చేశాడు’ అని రాసుకొస్తూ నాని వైల్డ్ పోస్టర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

Click For Tweet..

Read More..

తల పగిలి కుట్లు పడ్డా కూడా షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరో.. నీ డెడికేషన్‌కు టేక్ ఎ బౌ అంటూ ఫ్యాన్స్ కామెంట్స...

Next Story