తల పగిలి కుట్లు పడ్డా కూడా షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరో.. నీ డెడికేషన్‌కు టేక్ ఎ బౌ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్(పోస్ట్)

by I. Sairam |   (  Updated:2025-05-05 13:03:35  IST  )

నేచురల్ స్టార్ హీరోయిన్ నాని(Nani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తల పగిలి కుట్లు పడ్డా కూడా షూటింగ్‌లో పాల్గొన్న స్టార్ హీరో.. నీ డెడికేషన్‌కు టేక్ ఎ బౌ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ హీరోయిన్ నాని(Nani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘హిట్-3’(Hit-3) మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. మే 1న రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇక దీనికి శైలేష్ కొలను(Sailesh Kolanu) డైరెక్షన్‌లో వచ్చిన హిట్-3 యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మారింది. మాస్ అవతార్‌లో నాని అదరగొట్టాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో నాని గాయపడ్డాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా దర్శకుడు శైలేష్ ఎక్స్‌(X)లో హిట్ 3 సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోలు షేర్ చేశాడు. సినిమాలో కొన్ని అల్లరి మూకలను నాని తరిమే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో నాని తలకు గాయం అయ్యింది. అలాగే నాని ఒంటికి నిప్పు కూడా అంటుకుంది. తలకు దెబ్బ తగిలినా కూడా కుట్లు పడినా కూడా వెంటనే నాని షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.. అది ఆయన డెడికేషన్ అంటూ కొన్ని ఫొటోలు, వీడియోలను దర్శకుడు శైలేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక దీన్ని చూసిన నెటిజన్లు నాని డెడికేషన్‌కు టేక్ ఎ బౌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Click For Tweet..

Read More..

‘హిట్‌- 3’ రికార్డు.. వంద కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా.. వైరల్ అవుతున్న నాని వైల్డ్ పోస్టర్

Next Story