అత్యంత తక్కువ టికెట్ ధరకు హే బల్‌వంత్

by Pulgam srinivas |   (  Updated:2026-02-24 03:20:04  IST  )

హే బల్‌వంత్‌ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ స్క్రీన్లలో 99 రూపాయలకే ప్రదర్శించనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

అత్యంత తక్కువ టికెట్ ధరకు హే బల్‌వంత్
X

దిశ, వెబ్ డెస్క్ : కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్లినట్లయితే తెలుగు సినిమా పరిశ్రమలో టికెట్ ధరలు కాస్త తక్కువగా ఉండేవి. అలాగే ఓటీటీల వెసులుబాటు కూడా లేదు. దానితో పెద్ద ఎత్తున ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, కామన్ ప్రేక్షకులు కూడా సినిమాను థియేటర్కు వెళ్లి చూసేవారు. దానితో కాస్త మంచి సినిమాలకు సూపర్ వసూళ్లు దక్కడం, యావరేజ్ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకునేవి. కానీ కొన్ని సంవత్సరాలుగా స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలను భారీగా పెంచుతున్నారు. అలాగే కొంచెం క్రేజ్ ఉన్న సినిమాల టికెట్ ధరలను కూడా అలాగే పెంచేస్తున్నారు.

ఇక సినిమా విడుదల అయ్యి నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. దానితో చాలామంది ప్రేక్షకులు అంత డబ్బు పోసి సినిమాను థియేటర్కు వెళ్లి చూడాలా? నెల రోజుల్లోనే ఇంట్లో అంతా కలిసి చూడొచ్చు అనే అభిప్రాయానికి వచ్చేసారు. దానితో స్టార్ హీరోల సినిమాలకు బ్లాక్బస్టర్ టాక్ వచ్చిన సందర్భంలో, మరికొన్ని సినిమాలకు మాత్రమే పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తున్నాయి. చాలా చిత్రాలు బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగా మారింది. దానితో చిన్న సినిమాల నిర్మాతలు కొత్త స్ట్రాటజీతో ముందుకు వస్తున్నారు.

తమ సినిమాను అత్యంత తక్కువ టికెట్ ధరకు చూడండి అని ఆఫర్లు ఇస్తున్నారు. తాజాగా ఇదే ఫార్ములాను సుహాస్, శివానీ నాగారం జంటగా గోపి అచ్చర దర్శకత్వంలో రూపొందిన హే బల్‌వంత్ మూవీ యూనిట్ కూడా ఫాలో అయ్యింది. తాజాగా ఈ మూవీ బృందం వారు 99 రూపాయలకే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు, తక్కువ టికెట్ ధరకు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అని ఆఫర్ను ఇచ్చారు. మరి ఈ ఆఫర్ సినిమా వసూళ్లపై ఏ స్థాయి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.

ఓటీటీలోకి రాబోతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?




Next Story