- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓంశాంతి శాంతి శాంతి’ (Om Shanti Shanti Shanti)ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

దిశ, సినిమా: టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), ఈషా రెబ్బా (Isha Rebba)ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓంశాంతి శాంతి శాంతి’ (Om Shanti Shanti Shanti)ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఓటీటీల్లో ఒరిజినల్ వెర్షన్‌ను చూసేయడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. భార్యాభార్తల మధ్య సాగే ఫన్నీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ, రీమేక్ ఎఫెక్ట్ వల్ల థియేటర్ రన్ త్వరగానే ముగిసింది. తాజాగా.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (aha)లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ఈ చిత్రం మార్చి 4 నుంచి ఆహా యాప్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అయితే, ‘ఆహా గోల్డ్’ సబ్‌స్క్రైబర్ల కోసం ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. సాధారణ యూజర్ల కంటే 24 గంటల ముందే, అంటే మార్చి 3 నుంచే గోల్డ్ మెంబర్స్ ఈ సినిమాను వీక్షించవచ్చు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై ఎంజాయ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. కాగా.. వర్స్ స్టూడియోస్,ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మధ్యతరగతి కుటుంబంలో భార్యాభార్తల మధ్య వచ్చే గొడవలు, ఇగో క్లాషెస్‌ను కామెడీగా చూపించారు. ముఖ్యంగా ఈషా రెబ్బా నటన, తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. థియేటర్లలో ఆదరణ కరువైనప్పటికీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రానికి మంచి వ్యూయర్‌షిప్ దక్కుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి బుల్లితెరపై ఈ ‘ఓంశాంతి శాంతి శాంతి’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.






