Samyuktha: చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో డైరెక్టర్.. హీరోయిన్‌గా చాన్స్ అందుకున్న సంయుక్త!

by Chukka Sudharani |   (  Updated:2025-10-15 16:35:08  IST  )

బింబిసారా, సార్, విరూపాక్ష వంటి సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్త.. ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తుంది.

Samyuktha: చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో డైరెక్టర్.. హీరోయిన్‌గా చాన్స్ అందుకున్న సంయుక్త!
X

దిశ, సినిమా: బింబిసారా, సార్, విరూపాక్ష వంటి సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సంయుక్త.. ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తుంది. ఇప్పటికే ఈ అమ్మడు చేతిలో అఖండ 2, స్వయం భూ, నారీ నారీ నడుమ మురారి చిత్రాలతో పాటు.. పూరిసేతుపతి ప్రాజెక్టులో కూడా భాగం అయింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ హీరోయిన్ ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఓకే చేసినట్లు తెలుస్తుంది. చాలా ఏళ్ల క్రితం వెంకటేష్ హీరోగా వచ్చిన ‘చింతకాయల రవి’ సినిమాకు దర్శకత్వం వహించిన యోగి.. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్. ఈయన ఓ లేడి ఓరియెంటెడ్ మూవీని ప్లాన్ చేస్తున్నాడట. దీనికి ‘బ్లాక్ గోల్డ్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు టాక్. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తుండగా.. ఇందులో ప్రధాన పాత్ర కోసం సంయుక్తను ఓకే చేసినట్లు టాక్. అంతే కాకుండా.. దీనికి సంబంధించి ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ అయినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Read More..

పెళ్లికి ముందు సెక్స్.. భర్తతో కాకుండా మరొకరితో శృంగారం.. దీపిక సంచలన కామెంట్స్..

Next Story