స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం

by velandi.Saikiran |   (  Updated:2026-06-08 21:30:43  IST  )

స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు కేంద్ర‌మంత్రి కుమార‌స్వామి.

స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సంఘటనలో 9 మంది మరణించినట్లు చెబుతున్నారు. మరి కొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్ని ప్రమాద సంఘటన వద్దకు అర్ధరాత్రి కేంద్ర మంత్రి కుమారస్వామి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రమాద సంఘటన స్థలాన్ని కుమారస్వామి పరిశీలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం కేంద్రమంత్రి కుమారస్వామి కీలక ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి పది లక్షల రూపాయల చొప్పున అందిస్తామని స్పష్టం చేశారు. మరణించిన వారి కుటుంబంలో అర్హత గల ఒకరికి ఉపాధి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన వివరించారు. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేస్తూ పోస్టు పెట్టారు.

Next Story