- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లై ఏడాది కాకముందే భర్తతో దూరంగా హీరోయిన్ హోలీ సెలబ్రేషన్స్.. అసలు విషయం చెబుతూ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం తెలుగులో ‘జటాధర’(Jatadhara) అనే మూవీలో నటిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా ఈ భామ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన సంగతి విదితమే.
ఇక ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఈ బ్యూటీ నటుడు జహీర్ ఇక్బాల్(Jaheer iqbal)ను ప్రేమించి గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భర్తతో తెగ ఎంజాయ్ చేస్తుంది. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సోనాక్షి తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా హూలీ సెలబ్రెషన్స్ చేసుకున్న ఫొటోలను షేర్ చేసింది.
అయితే ఆ ఫొటోస్‌లో ఎక్కడా తన భర్త జహీర్ కనిపించకపోడంతో నెటిజన్లు అతను ఎక్కడా అని కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో సోనాక్షి వీళ్లందరి నోరు మూయించేలా గట్టి రిప్లై ఇచ్చింది. ‘‘‘హోలీ వచ్చేసింది. హ్యాపీ హోలీ. రంగులు చల్లండి. సంతోషాన్ని పంచండి. నేను ప్రస్తుతం ‘జటాధర’ షూట్‌లో ఉన్నాను. ఈ సెట్‌లోనే హోలీ వేడుకలు చేసుకున్నాను. . కామెంట్స్ చేసే వారందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. జహీర్ ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడు.
మేమిద్దరం ఒకే చోట లేకపోవడం వల్ల హోలీ వేడుకలు కలిపి చేసుకోలేకపోయాం. మా గురించి ఆలోచించి మీ తలలు వేడెక్కి ఉండవచ్చు. తలపై కాస్త నీళ్లు చల్లుకోండి’’ అని కౌంటర్ ఇచ్చింది సోనాక్షి. ఇక ఈ మెసేజ్‌కి తన భర్త మిస్సింగ్ యు బేబీ అనే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ భామ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.
Read More..
హ్యాపీ బర్త్ డే డియర్ అంటూ ఆ స్టార్ హీరో భార్యకు స్పెషల్ విష్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్






