- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ సినిమా ‘జన నాయగన్’.. ప్రేక్షకులకు గుడ్‌న్యూస్
దళపతి విజయ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: దళపతి విజయ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా మంజూరు కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు పూర్తి రీఫండ్ ఇస్తున్నట్లు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు తాజాగా డీఎన్‌సీ థియేటర్స్ అధికారికంగా ప్రకటించింది. తమిళనాడులో ఈ రోజు, తెలుగు రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాల్లో రేపు సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. అయితే సెన్సార్ ప్రక్రియలో జాప్యం జరగడంతో విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే భారీ మొత్తంలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’పై మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.
విజయ్ సినిమాపై అధికార పార్టీ టార్గెట్
ఇదిలా ఉండగా, విజయ్ రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల్లోకి రావడం, పార్టీ సభల్లో అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే విజయ్ సినిమాను అధికార పార్టీలు టార్గెట్ చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావాలనే సెన్సార్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమా విడుదలపై అనుమానాలు మరింత పెరిగాయి.
సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడో?
నిర్మాతల నుంచి స్పష్టమైన గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో బయ్యర్లు విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే బుక్ అయిన టికెట్ల డబ్బును ఆన్‌లైన్ ద్వారా స్వయంచాలకంగా తిరిగి చెల్లిస్తామని థియేటర్ యాజమాన్యాలు వెల్లడించాయి. తమిళనాడులో సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొనగా, సంక్రాంతి మార్కెట్ దాటిపోతే భారీ నష్టాలు తప్పవు అనే ఆందోళనలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ‘జన నాయగన్’కు ఎప్పుడు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ వస్తుందో, విడుదల ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Read More..






