విజయ్ సినిమా వాయిదా.. ఉహించని జాక్ పాట్ కొట్టిన ప్రభాస్ "రాజా సాబ్"

by Malleboina Mahesh |

విజయ్ దళపతి నటించిన 'జన నాయగన్' సినిమా వాయిదా పడటంతో ప్రభాస్ 'రాజాసాబ్' జాక్‌పాట్ కొట్టింది.

విజయ్ సినిమా వాయిదా.. ఉహించని జాక్ పాట్ కొట్టిన ప్రభాస్ రాజా సాబ్
X

దిశ, వెబ్ డెస్క్: సెన్సార్ చిక్కులతో తమిళ స్టార్ హీరో విజయ్ (hero Vijay) చివరి సినిమా అయిన పొలిటికల్ డ్రామా ‘జన నాయగన్’ విడుదలకు బ్రేక్ పడింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేయాల్సి ఉంది. అయితే సినిమాలో తమిళ రాజకీయాలను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత డైలాగ్స్ ఉన్న క్రమంలో సెన్సార్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించింది. అయితే ప్రభుత్వం, చిత్ర యూనిట్ వాదనలను విన్న కోర్టు తీర్పును ఈ నెల9కి రిజర్వ్ చేసింది. దీంతో చివరి నిమిషంలో ‘జన నాయగన్’ ('Jana Nayagan') విడుదలను చిత్ర యూనిట్ వాయిదా వేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఇస్తుందనుకున్న విజయ్ సినిమా రేసు నుంచి తప్పుకోవడం, అదే రోజు విడుదలవుతున్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (hero Prabhas) చిత్రం ‘రాజా సాబ్ కు ఊహించని వరంలా మారింది.

తమిళనాట ప్రభాస్ హవా - భారీ వసూళ్లపై కన్ను

‘జన నాయగన్’ విడుదల్వడంతో ‘రాజాసాబ్’ చిత్రానికి భారీ జాక్‌పాట్ తగిలింది. ముఖ్యంగా తమిళనాడులోని దాదాపు అన్ని ప్రధాన థియేటర్లలో ‘జన నాయగన్’ కోసం కేటాయించిన స్క్రీన్‌లను ఇప్పుడు ప్రభాస్ సినిమాకు బదిలీ చేస్తున్నారు. పండుగ సీజన్ కావడం, పోటీగా పెద్ద సినిమా లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలోనూ ‘రాజా సాబ్’ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ అనూహ్య పరిణామం చిత్ర యూనిట్‌కు, అభిమానులకు పండుగను ముందే తెచ్చిపెట్టింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా సెన్సార్ సభ్యులు, చిత్ర యూనిట్, డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీ హిట్ టాక్ వస్తుంది.

Next Story