తెలుగోళ్ల గొప్పతనం అదే.. సీనియర్ నటుడు శ్రీకాంత్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2026-05-29 12:04:09  IST  )

సీనియర్ నటుడు శ్రీకాంత్, లయ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.

తెలుగోళ్ల గొప్పతనం అదే.. సీనియర్ నటుడు శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు శ్రీకాంత్, లయ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలు జే క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీకాంత్.. తెలుగు వాళ్లపై ఆసక్తిక కామెంట్స్ చేశాడు. ‘నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోనే. మాది రైతు కుటుంబం. వ్యవసాయం చెయ్యడానికి తెలుగోళ్లు చాల మంది కర్నాటక వలస వస్తారు. కర్నాటకలో చాలా మంది తెలుగోళ్లు ఉన్నారు. తెలుగోళ్ల గొప్పతనం ఏంటంటే.. వ్యవసాయం ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు’ అని చెప్పుకొచ్చాడు. ఇక తను సినీ ఎంట్రీపై మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తి చేశాకే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్లు తెలిపారు.

ప్రొడ్యూసర్లకు ఊరట.. ధనుష్ తీసుకున్న కొత్త నిర్ణయం ఇదే

Next Story