- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొడ్యూసర్లకు ఊరట.. ధనుష్ తీసుకున్న కొత్త నిర్ణయం ఇదే
పారితోషకం విషయంలో ధనుష్ సంచలన నిర్ణయం.. నిర్మాతలకు భారీ ఊరట.

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ నటుడు ధనుష్ తన పారితోషకం విషయంలో ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ‘కర’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ.60 కోట్ల పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్ర నిర్మాణానికి కేవలం రూ.25 కోట్ల మాత్రమే ఖర్చైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ధనుష్‌కు ఉన్న క్రేజ్ కారణంగా ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల రూపంలో చిత్రానికి మంచి బిజినెస్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ధనుష్ ‘అమరన్’ మూవీ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
ఈ చిత్రం కోసం ఆయన ఏకంగా రూ.70 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలా ధనుష్ పారితోషకం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తన వల్ల నిర్మాతలపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై తాను నటించబోయే సినిమాల్లో తన సొంత నిర్మాణ సంస్థను భాగస్వామిగా ఉంచాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అలాగే సినిమా బిజినెస్ మొత్తం పూర్తైన తర్వాతే తన పారితోషకం తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే నిర్మాతలపై ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుందని ధనుష్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.






