- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలెంటెడ్ డైరెక్టర్‌తో హీరో నితిన్ న్యూ మూవీ.. అఫీషియల్ అనౌన్స్ పోస్టర్‌తో హైప్
గత కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న నితిన్(Nithin) ఎట్టకేలకు తన కొత్త సినిమాని ప్రకటించాడు.

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్న నితిన్(Nithin) ఎట్టకేలకు తన కొత్త సినిమాని ప్రకటించాడు. వెర్సటైల్ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్(VI Anand) దర్శకత్వంలో నితిన్ 36వ సినిమాని నేడు ప్రకటించారు. పవన్ కుమార్(Pawan Kumar) సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మేరకు తాజాగా నితిన్ తన ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ నో బాడీ.. నో రూల్స్.. వాస్తవ నియమాలు ఇప్పుడే మారిపోయాయి.
నా సోదరుడితో ప్రయాణం ప్రారంభించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను’ అని డైరెక్టర్ వీఐ ఆనంద్‌ను ట్యాగ్ చేశాడు. ఇక పోస్టర్‌లో నితిన్ సిగరెట్ తాగుతూ స్టైలీష్‌గా పొగను వదులుతున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా డిఫరెంట్ సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులకు మంచి అనుభవం ఇచ్చే దర్శకుడు VI ఆనంద్ దర్శకత్వంలో నితిన్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతోనైనా నితిన్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాల్సి ఉంది.
READ MORE ....






