‘ప్యాట్రియాట్’ నుంచి లేడీ సూపర్ స్టార్ పోస్టర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

by I. Sairam |   (  Updated:2026-01-25 12:26:59  IST  )

మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘ప్యాట్రియాట్’.

‘ప్యాట్రియాట్’ నుంచి లేడీ సూపర్ స్టార్ పోస్టర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘ప్యాట్రియాట్’. అయితే పదిహేడేళ్ల తర్వాత వీరి కాంబో తెరపైకి రానుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనికి మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పుష్ప మూవీ ఫేమ్ ఫహాద్ ఫాజిల్, నయనతార కీ రోల్ ప్లే చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 9న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి లేడీ సూపర్ స్టార్ నయనతార ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక పోస్టర్‌లో నయనతార చాలా డీసెంట్ లుక్‌లో కనిపించారు. బూడిద కలర్ శారీలో కాలర్ నెక్ బ్లౌజ్‌లో బ్లాక్ బొట్టుపిల్ల పెట్టుకుని కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE ....

టాలెంటెడ్ డైరెక్టర్‌తో హీరో నితిన్ న్యూ మూవీ.. అఫీషియల్ అనౌన్స్‌ పోస్టర్‌తో హైప్

Next Story