- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆమె తీరు నన్ను కదిలించింది.. ప్రియాంక చోప్రా ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు గతంలో పలు హిందీ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రియాంక చోప్రా ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుని తనదైన ముద్ర వేసుకుంది. ఈ క్రమంలోనే ఈ భామ పెళ్లి చేసుకుని హాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడు కూడా ఎన్నో సినిమాల్లో నటించి తన అందం, అభినయం, నటనతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ఓ తెలుగు మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘SSMB29’చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
దీనికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా నిమిషాల్లో సోషల్ మీడియాను షేక్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా ఇందులో ప్రియాంక చోప్రా నటిస్తుందనడంతో అంతా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అమ్మడు ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇదిలా ఉంటే... తాజాగా, ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. షూటింగ్ నుంచి వస్తున్న క్రమంలో తనకు ఓఆసక్తికర సంఘటన ఎదురైనట్లు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోతో పాటు పలు ఫొటోలను కూడా షేర్ చేసింది. ‘‘నేను ఇలా తరచుగా చేయను. కానీ ఈ రోజు ఎందుకో నాకు చాలా స్పూర్తినిచ్చే సంఘటన ఎదురైంది. నేను ముంబయికి వెళ్తున్న క్రమంలో విశాఖపట్నం విమానాశ్రయానికి కారులో వెళ్తుండగా వైజాగ్ ట్రాఫిక్‌లో ఆగింది.
ఈక్రమంలో ఓ మహిళ జామపండ్లు అమ్ముతుండటం చూశాను. నాకు కచ్చగా ఉన్న జామపండ్లు అంటే ఇష్టం ఉండటం వల్ల ఆ మహిళను పిలిచి అన్ని పండ్లు ఎంత ధరనో అడిగాను. వాటన్నింటికీ ఆమె కేవలం రూ. 150 అని చెప్పింది. అయితే నేను ఆ మహిళకు రూ.200 రూపాయల నోటు ఇచ్చాను. కానీ నాకు ఆమె మిగతా రూ. 50 చిల్లర ఇవ్వాలని ప్రయత్నించింది. నేను వద్దు దయచేసి వద్దు మీరే ఉంచుకోండి అని చెప్పాను. దీంతో ఆమె నాకు ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్ పడేలోపే వచ్చి నాకు మరో రెండు జామపండ్లు ఇచ్చింది. అప్పుడే నాకు అనిపించింది. ఆమె నా నుంచి ఎలాంటి దాతృత్వాన్ని కోరుకోలేదు. ఆమె తీరు నిజంగా నన్ను కదిలించింది’’అని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె అమ్మిన జామకాయలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ప్రియాంకపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read More..
అదిరిపోయే లోక్‌లో దర్శనమిచ్చిన అల్లు అర్జున్ బ్యూటీ.. గార్జియస్ అంటూ నెటిజన్ల కామెంట్స్






