- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదిరిపోయే లోక్‌లో దర్శనమిచ్చిన అల్లు అర్జున్ బ్యూటీ.. గార్జియస్ అంటూ నెటిజన్ల కామెంట్స్
టాలీవుడ్ హీరోయిన్ హన్షిక(Hanshika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది ఈ భామ.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ హన్షిక(Hanshika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది ఈ భామ. ఇక తెలుగులో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘దేశ ముదురు’(Desamuduru) సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో హన్సిక చాలా ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అలా కందిరీగ(Kandireega), పవర్(Pawar), బిందాస్(Bindas), మస్కా(Maska), బిల్లా(Billa) లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది.
టాలీవుడ్‌లోనే కాకుండా ఈ అమ్మడు బాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా ‘ఆప్ కా సురూర్’(Aap Ka Suroor) సినిమాతో మంచి హిట్ అందుకుంది. అలాగే తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకుంది. అయితే, హన్షికకి అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు బాగానే ఉన్నాయి. కానీ, ఎంచుకున్న సినిమాలు ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు.
దీంతో సినిమా ఆఫర్లు లేక కొంత గ్యాప్ ఇచ్చింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి పలు షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తుంది. అలా తెలుగులో ప్రసారమయ్యే డ్యాన్స్ షో అయినటువంటి ‘ఢీ’(Dhee) షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో అదరహో అనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా హన్షిక తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అలాగే రెండు చేతుల్లో సాంబ్రాణి పొగ పట్టడానికి ఉపయోగించే కుండీలను చేతిలో పట్టుకుని తన చుట్టు మొత్తం రోజ్ ప్లవర్ వేసుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు.. గార్జియస్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read More..
ఆమె తీరు నన్ను కదిలించింది.. ప్రియాంక చోప్రా ఎమోషనల్ పోస్ట్






