అతను నాకు రోజు ఆ పని కోసం 30 నిమిషాలే కెటాయిస్తాడు.. పవిత్ర లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-21 07:12:24  IST  )

సీనియర్ యాక్టర్స్ నరేష్ – పవిత్ర లోకేష్ కొన్నాళ్లుగా లివింగ్ రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

అతను నాకు రోజు ఆ పని కోసం 30 నిమిషాలే కెటాయిస్తాడు.. పవిత్ర లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ యాక్టర్స్ నరేష్ – పవిత్ర లోకేష్ కొన్నాళ్లుగా లివింగ్ రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వారి బంధాన్ని అధికారికంగానే ప్రకటించి అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి సినిమా ఈవెంట్స్‌లో కనిపిస్తున్నారు. ప్రజెంట్ నరేష్ ప్రధాన పాత్రలో శుభకృత్ నామ సంవత్సరం అనే సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాని ప్రకటిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌కి నరేష్ పవిత్ర జంటగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్లో పవిత్ర లోకేష్ నరేష్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలో 54 ఏళ్లు ఆయనకు. అలాంటి ఒక ఆర్టిస్ట్‌తో నా జీవితం గడపడం అనేది నా అదృష్టం, దేవుడి బ్లెస్సింగ్ అది. ఆయన ప్రతి పాత్రకు ఒకేలా చాలా ప్రిపేర్ అయి కష్టపడతారు. నేను ఆయనతో మాట్లాడాలంటే టైం తీసుకోవాల్సి వస్తుంది. ఆయన అంత బిజీగా ఉన్నారు. రోజు మొత్తంలో నాకు ఒక అరగంట దొరుకుతుందేమో ఆయనతో మాట్లాడటానికి. ఇంత పెద్ద నటుడితో కలిసి జీవిస్తున్నాను అని నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More..

Nidhi Agarwal: సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. నన్ను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోనంటూ నిధి స్ట్రాంగ్ వార్నింగ్

Next Story