- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nidhi Agarwal: సెలబ్రిటీలు పబ్లిక్ ప్రాపర్టీ కాదు.. నన్ను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోనంటూ నిధి స్ట్రాంగ్ వార్నింగ్
సినిమా ఇండస్ట్రీలో నటీనటులపై జరుగుతున్న నెగెటివ్ పిఆర్, పెయిడ్ ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లపై నటి నిధి అగర్వాల్ (Nidhi Agarwal)తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో నటీనటులపై జరుగుతున్న నెగెటివ్ పిఆర్, పెయిడ్ ఆన్‌లైన్ క్యాంపెయిన్‌లపై నటి నిధి అగర్వాల్ (Nidhi Agarwal)తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల రణవీర్ అల్లాబాడియా(Ranveer Allahbadia) పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, ఒకరిని పైకి తీసుకురావడం కంటే.. డబ్బు ఖర్చు చేసి మరీ ఎదుటివారిని తొక్కేయడానికి ప్రయత్నించడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బుక్ మై షో రేటింగ్స్, IMDb రివ్యూలను కూడా డబ్బుతో ప్రభావితం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇటీవల తనపై కూడా ఒకటి రెండు నెగెటివ్ క్యాంపెయిన్‌లు మొదలయ్యాయని, అయితే తాను వాటిని వెంటనే అడ్డుకున్నానని ఆమె వెల్లడించారు.
‘‘నేను నా పనితో పైకి ఎదుగుతా, కానీ నన్ను కావాలని దెబ్బతీయాలని చూస్తే ఊరుకోను’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నటీనటులు చాలా సున్నిత మనస్కులని, ఇటువంటి దాడులు వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిధి ఆందోళన వ్యక్తం చేశారు. వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ వంటి నటులపై జరిగిన నెగెటివ్ పిఆర్ దాడులను ప్రస్తావిస్తూ.. ఇలాంటివి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ‘‘సెలబ్రిటీలు అంటే పబ్లిక్ ప్రాపర్టీ కాదు, వారికి కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు. వారికి మేము సమాధానం చెప్పుకోవాలి’’ అని ఆమె స్పష్టం చేశారు. ప్రతిభను ప్రోత్సహించడం మాని, ఇలా ఒకరిని కిందకు లాగడానికి ప్రయత్నించడం సరైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.






