- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉమెన్స్ డే శుభాకాంక్షలు.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్
పద్మ విభూషణుడు, మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘విశ్వంభర’(Vishwambhara) మూవీలో నటిస్తున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: పద్మ విభూషణుడు, మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ‘విశ్వంభర’(Vishwambhara) మూవీలో నటిస్తున్నాడు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) సందర్భంగా ఉమెన్స్ అందరికీ శుభాకాంక్షలు వెల్లువ వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మన చిరు కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో తన భార్య సురేఖ(Surekha), సీనియర్ హీరోయిన్స్ అయినటువంటి టబు(Tabu), జయసుధ(Jayasudha), మీనా(Meena), సుహాసిని(Suhasini), రాధిక(Radhika), కుష్బూ(Khushboo), నదియా(Nadiya)లతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ..
“నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ బొకే, నమస్కారం చేస్తున్న ఎమోజీలను జోడించాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దాన్ని చూసిన ఖుష్బూ సో స్వీట్ సార్ థాంక్యూ అని రిప్లై ఇచ్చింది.
Read Also..
మెగా డాటర్ శ్రీజ భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణం ఆమెనా.. బయటపడ్డ సంచలన నిజం?






