మెగా డాటర్ శ్రీజ భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణం ఆమెనా.. బయటపడ్డ సంచలన నిజం?

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-08 15:20:29  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఎన్నో సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన కోసం ఎంతోమంది ప్రాణాలు కూడా ఇస్తారనడంలో అతిశయోక్తి లేదు.

మెగా డాటర్ శ్రీజ భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణం ఆమెనా.. బయటపడ్డ సంచలన నిజం?
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఎన్నో సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన కోసం ఎంతోమంది ప్రాణాలు కూడా ఇస్తారనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు రాష్ట్రాల్లో చిరు ఫుల్ పాపులారిటీతో పాటు, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన చిన్న కూతురు శ్రీజ చేసిన పనికి మాత్రం మెగా ఫ్యామిలీ మొత్తం సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారారు. దానికి కారణం ఆమె ప్రేమ పెళ్లితో పాటు విడాకులు తీసుకోవడం గమనార్హం. శ్రీజ(Sreeja) పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె సినిమాల్లో నటించినప్పటికీ శిరీష్ భరద్వాజ్‌(Shirish Bharadwaj)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది.

ఈ క్రమంలోనే ఈ జంట మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని చిరు ఇంటికి చేరింది. ఆ తర్వాత కూతురి బాధను చూడలేక కళ్యాణ్ దేవ్‌(Kalyan Dev)కి ఇచ్చి వివాహం జరిపించాడు. కొద్ది కాలం పాటు వీరి కాపురం సాఫీగానే సాగినప్పటికీ ఓ కూతురు పుట్టిన తర్వాత విడిపోయారు. ఇక ఇద్దరు పిల్లలతో గత కొద్ది రోజుల నుంచి శ్రీజ చిరంజీవి ఇంట్లోనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మెగాస్టార్ ఉమెన్స్ డే సందర్భంగా శ్రీజ విడాకుల గురించి మొదటిసారి స్పందించారు. ‘‘శ్రీజ తన జీవితానికి సంబంధించిన ఏ విషయం అయినా మా అమ్మ అంజనమ్మకు చెబుతుంది.

ఆమె సలహాలు తీసుకుంటుంది. ముఖ్యంగా విడాకుల సమయంలో చాలా డిప్రెషన్‌లోకి వెళ్లింది. అప్పుడు మా అమ్మ సలహా తీసుకుంది. ఎవడో ఒకడి గురించి నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోకూడదు నువ్వు ముందుకు వెళ్లాలి అని తనలో ధైర్యాన్ని నింపింది. రెండుసార్లు విడాకులు తీసుకున్న సమయంలో శ్రీజ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. శ్రీజ విషయంలోనే కాదు మాలో కూడా మా అమ్మ ధైర్యాన్ని నింపి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు.


Read Also..

అందుకే అలాంటి టైటిల్ పెట్టాం.. నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను: రాజ్

Next Story