మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పెద్ది నుంచి సెకెండ్ సింగిల్ వచ్చేది అప్పుడే..

by I. Sairam |   (  Updated:2026-01-05 03:49:51  IST  )

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌(Ram Charan) హీరోగా నటిస్తున్న రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’(Peddi).

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పెద్ది నుంచి సెకెండ్ సింగిల్ వచ్చేది అప్పుడే..
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌(Ram Charan) హీరోగా నటిస్తున్న రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’(Peddi). ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా(Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే శివరాజ్‌ కుమార్‌(shiva Raj Kumar), జగపతిబాబు(Jagapathi Babu), దివ్యేందు శర్మ(Divyendu Sharma) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్‌(AR Rahman) సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’(Chikiri Chikiri) సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారి సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటికొచ్చింది. సంక్రాంతి కానుకగా రెండో పాటను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ‘చికిరి చికిరి’ సూపర్‌హిట్‌ కావడంతో.. రెండో పాట మీద మరింత అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More..

ఎపిక్ మూవీ నుంచి కడలి పోస్టర్ రిలీజ్.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

Next Story