ఎపిక్ మూవీ నుంచి కడలి పోస్టర్ రిలీజ్.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

by I. Sairam |   (  Updated:2026-01-05 03:46:04  IST  )

'బేబీ'(Baby) సినిమాతో హిట్ పెయిర్‌గా నిలిచిన ఆనంద్ దేవరకొండ(Anandh Devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) మరోసారి 'ఎపిక్'(Epic) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఎపిక్ మూవీ నుంచి కడలి పోస్టర్ రిలీజ్.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: 'బేబీ'(Baby) సినిమాతో హిట్ పెయిర్‌గా నిలిచిన ఆనంద్ దేవరకొండ(Anandh Devarakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) మరోసారి 'ఎపిక్'(Epic) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘#90s ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ ఫేమ్‌ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ఆమెకు విషెస్ తెలిపారు.

దీంతో వైష్ణవి తన సోషల్ మీడియాలో ఆ పోస్టర్‌ను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘కడలికి నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆమెకు ప్రాణం పోసుకోవడం నాకు చాలా ఆనందంగా, గౌరవంగా అనిపించింది. ఈ సినిమా, ఈ పాత్ర, దాని వెనుక ఉన్న అందమైన వ్యక్తులకు మాటల్లో చెప్పలేని కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు’ అని రాసుకొస్తూ హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఆమెకు విషెస్‌తో పాటు సినిమా మంచి విజయం సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

బికినీలో రెచ్చిపోయిన‌ సురేఖ‌, సుప్రీత !

Next Story