- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sivaji: వీలైతే నా అవార్డు అతనికి ఇచ్చేయండి
శివాజీ మాట్లాడుతూ... దండోరా సినిమాలోని నా నటనకు గద్దర్ అవార్డు వచ్చింది. ఆ సినిమా కోసం నా కన్నా దర్శకుడు ఎక్కువ కష్టపడ్డాడు. నా అవార్డును అతనికి ఇస్తే నేను ఇంకా సంతోషిస్తాను అని ఆయన చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ పోయిన సంవత్సరం దండోరా అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో నవదీప్, నందు, బిందు మాధవి ముఖ్య పాత్రల్లో నటించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై మంచి అంచనాలు జనాల్లో ఏర్పడ్డాయి.
అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా 2025 సంవత్సరానికి గాను గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఈ సినిమాలోని శివాజీ నటనకు గద్దర్ అవార్డు దక్కింది. తాజాగా గద్దర్ అవార్డు దక్కడంతో ఆయన దీనిపై స్పందిస్తూ "ఈ చిత్రంలోని నా నటనకు గద్దర్ అవార్డు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ సినిమా కోసం నాకన్నా దర్శకుడు చాలా ఎక్కువ కష్టపడ్డాడు, నా అవార్డు అతనికి ఇస్తే నేను ఇంకా సంతోషిస్తాను" అని ఆయన చెప్పుకొచ్చాడు.
తాజాగా శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా దండోరా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడానికి శివాజీ కొన్ని కారణాలను తెలియజేశాడు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన విడుదల కాగా 24వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు సెన్సార్ కాలేదు, దానితో థియేటర్లు ఎవరూ ఇవ్వలేదు. ఈ సినిమా టైటిల్ కూడా ఈ సినిమా ఫెయిల్యూర్ కావడానికి ఒక కారణం అని ఆయన చెప్పుకొచ్చాడు.






