- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను తగులుకుంటే మీకే ప్రమాదం.. పేటియం బ్యాచ్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!
నేను జనం కోసం బతికేవాడిని కానీ, మీలాగా ఎవరో ఇచ్చే పేటియం డబ్బుల కోసం బతికే రకాన్ని కాదు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల హీరోయిన్ల దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ వివాదం సర్దుమణిగి వరుస సినిమాలతో బిజీ అవుతున్నసమయంలో, కొందరు కావాలనే తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఒక షాకింగ్ వీడియోను విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమా విడుదల కాకముందే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. "వంద మంది సబ్‌స్క్రైబర్లు లేని వాళ్లు కూడా నా సినిమాపై నెగిటివ్ వార్తలు రాస్తున్నారు. వారిపై ఫిర్యాదు చేద్దామనుకున్నా కానీ, పిల్ల నాయనలని వదిలేశాను. కానీ ఒరేయ్ పేటియం బ్యాచ్.. నన్ను తగులుకుందామనుకుంటే అది మీకే ప్రమాదం.
నేను జనం కోసం బతికేవాడిని కానీ, మీలాగా ఎవరో ఇచ్చే పేటియం డబ్బుల కోసం బతికే రకాన్ని కాదు" అంటూ ఘాటుగా హెచ్చరించారు. తనను సోషల్ మీడియా పోస్టులతో ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ.. అమరావతి రైతుల కోసం తాను ఎప్పుడూ నిలబడతానని శివాజీ అన్నారు. "జగన్ గారు.. నా జోలికి రావద్దు, నాకు రాజకీయాలు వద్దు. అమరావతి జనాల కోసం నేను ఏ పార్టీనైనా ఎదురిస్తాను. మోదీ గారిని కూడా అడుగుతాను.. సీబీఐ మీద నమ్మకం ఉండాలంటే ముందు కేసులున్న రాజకీయ నాయకుల సంగతి తేల్చాలి" అని డిమాండ్ చేశారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని, గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడే తనను ఏమీ చేయలేకపోయారని ఆయన గుర్తు చేశారు. తన పని తాను చేసుకుంటుంటే అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని, నిజాయితీగా బతుకుతున్న తన జోలికి వస్తే ఊరుకోనని శివాజీ హెచ్చరించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారింది.






