- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకప్పుడు స్టార్ దర్శకులు.. ఇప్పుడు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు..?
తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ దర్శకులుగా కొనసాగిన శ్రీను వైట్ల, పూరీ జగన్నాథ్, వి.వి. వినాయక్, సురేందర్ రెడ్డి ప్రస్తుతం మాత్రం ప్లాప్లను అందుకుంటున్నారు. దాంతో వీరికి మునుపటితో పోలిస్తే అవకాశాలు చాలా వరకు తగ్గాయి.

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ లో ఏ క్రాఫ్ట్ లో ఉన్నవారికైనా ఈరోజు ఉన్నట్లే రేపు ఉంటుందని చెప్పడం కష్టం. ఎందుకంటే సినిమా రంగం అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఇందులో రోజు సరికొత్తగా ఆలోచించే వారు మాత్రమే మంచి దశలో ముందుకు సాగుతుంటారు. ఎవరైతే ఆలోచన విధానంలో వెనక ఉంటారో వారికి అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా దర్శకులు కొత్త టెక్నాలజీని, యువత మనసును తెలుసుకోనట్లయితే వారికి ప్లాప్స్ దక్కడం ఖాయం.
ఇక తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ దర్శకులుగా కొనసాగి వరుస అపజయాల వల్ల కెరీర్ డౌన్ ఫాల్ అయి ప్రస్తుతం అవకాశాల కోసం అత్యంత కష్టపడుతున్న దర్శకులు చాలానే మంది ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన కెరీర్ ప్రారంభం నుండి మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు. దూకుడు సినిమా సూపర్ హిట్ కావడంతో స్టార్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన ఏ సినిమా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ దర్శకుడు తన తదుపరి మూవీని శర్వానంద్ తో చేయనున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక వి.వి. వినాయక్ కూడా స్టార్ డైరెక్టర్గా కొనసాగాడు. ప్రస్తుతం ఈయన చేతిలో సినిమా అవకాశాలే లేవు. పూరి జగన్నాథ్ కూడా ఈ లిస్టులోకే వస్తాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే ఈయన ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు సురేందర్ రెడ్డి కూడా తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన దర్శకుడిగా కెరీర్ను కొనసాగించాడు. ఆఖరుగా ఈయన దర్శకత్వం వహించిన ఏజెంట్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ దర్శకుడికి అవకాశాలు తగ్గాయి. సురేందర్ రెడ్డి తన తదుపరి మూవీని పవన్ కళ్యాణ్ తో చేయనున్నాడు. ఆ మూవీ మంచి విజయం సాధిస్తే మళ్లీ ఈయనకు క్రేజ్ వస్తుంది.






