- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరవింద సమేత కంటే ఆ క్యారెక్టరంటేనే ఇష్టం: జగపతిబాబు
జగపతిబాబు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఆఖరుగా చేసిన 70,80 సినిమాలలో నా మనసుకు నచ్చినవి కేవలం 5,6 పాత్రలు మాత్రమే ఉంటాయి. అందులో రంగస్థలం సినిమాలోని పాత్ర ఒకటి. అదే సంవత్సరం నేను నటించిన అరవింద సమేత విడుదల అయింది. ఆ పాత్ర కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కానీ ఈ రెండు సినిమాల్లోని పాత్రలలో నాకు ఏది బాగా నచ్చింది అంటే రంగస్థలం అని చెప్పేస్తాను అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : వెర్సటైల్ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి అద్భుతమైన విజయాలను అందుకొని చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి దశలో కెరీర్‌ను ముందుకు సాగించాడు. హీరోగా అనేక సంవత్సరాలు కొనసాగిన జగపతిబాబుకి ఆ తర్వాత వరుస పెట్టి ఫ్లాప్స్ రావడం మొదలైంది. దానితో ఈయనకు అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. అలాంటి సమయంలోనే ఈ నటుడు హీరోగా కాకుండా విలన్ పాత్రల వైపు టర్న్ అయ్యాడు.
అందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన లెజెండ్ మూవీలో విలన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడం, ఇందులో జగపతిబాబు పాత్రకు ప్రేక్షకుల, విమర్శకుల నుండి ప్రశంసలు దక్కడంతో వరుస పెట్టి జగపతిబాబుకు విలన్ పాత్రల్లో అవకాశాలు వచ్చాయి. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా ఈయనకు అనేక ఇతర భాషా చిత్రాల్లో కూడా అవకాశాలు రావడం మొదలైంది. దానితో ప్రస్తుతం జగపతిబాబు అత్యంత బిజీ నటుడిగా కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నాడు.
తాజాగా జగపతిబాబు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో తన మనసుకు అత్యంత నచ్చిన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. జగపతిబాబు మాట్లాడుతూ... నేను ఆఖరుగా చేసిన 70, 80 సినిమాలలో నా మనసుకు నచ్చిన పాత్రలు మాత్రం కేవలం ఐదారు మాత్రమే ఉంటాయి. అందులో రంగస్థలం మూవీలోని పాత్ర ఒకటి. అదే సంవత్సరం అరవింద సమేత సినిమా వచ్చింది. ఆ సినిమాలోని నా పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ ఈ రెండు సినిమాల్లో ఏ పాత్ర మీకు బాగా నచ్చింది అని అంటే మాత్రం రంగస్థలం అని చెప్పేస్తాను. ఆ పాత్ర నాకు అంత బాగా నచ్చింది అని తాజాగా జగపతిబాబు చెప్పుకొచ్చాడు.






