- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కారణంతో ‘పెద్ది’ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా.. శివరాజ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
తన ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమా షూటింగ్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘పెద్ది’ జూన్ 4న థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న మూవీ టీమ్ పలు విషయాలను పంచుకుంటున్నారు. ఇక ఇందులో గౌరినాయుడు పాత్రలో కనిపించబోతున్న శివరాజ్ కుమార్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చెన్నైలో జరిగిన ‘పెద్ది’ మూవీ ఈవెంట్‌లో శివరాజ్‌కుమార్ పాల్గొని, ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రం తనకు ఎంతో స్పెషల్ అని చెబుతూ.. ఒక దశలో ఈ ప్రాజెక్ట్ నుండి తాను తప్పుకోవాలని అనుకున్నట్లు వెల్లడించారు. డైరెక్టర్ బుచ్చిబాబు తనకు కథ చెప్పినప్పుడు సబ్జెక్ట్ చాలా బాగా నచ్చిందని, దాంతో వెంటనే నటించడానికి ఓకే చెప్పానని శివరాజ్‌కుమార్ తెలిపారు. ఆ రోజు తాను రామ్ చరణ్‌తో కూడా మాట్లాడానని గుర్తుచేసుకున్నారు.
అయితే, ఆ తర్వాత దురదృష్టవశాత్తు తనకు క్యాన్సర్ అని నిర్ధారణ అయిందని, దాంతో చికిత్స నిమిత్తం తాను అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. నాటి పరిస్థితుల్లో తన ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమా షూటింగ్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. తన అనారోగ్యం కారణంగా సినిమాలో తాను పోషించాల్సిన ‘గౌర్‌నాయుడు’ పాత్రకు వేరే నటుడిని చూసుకోవాలని చిత్ర యూనిట్‌కు స్పష్టం చేశానని ఆయన అన్నారు. తన నిర్ణయాన్ని మూవీ టీమ్‌కు తెలియజేసి, వేరే ఆప్షన్ చూసుకోమన్నప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతలు అందుకు అస్సలు ఒప్పుకోలేదని చెప్పారు. బుచ్చిబాబు తన దగ్గరకు వచ్చి ఆ పాత్రకు తానే కావాలని పట్టుబట్టారని వెల్లడించారు. తాను అమెరికా వెళ్లి చికిత్స ముగించుకుని తిరిగి వచ్చేంత వరకు సినిమా షూటింగ్ ప్రారంభించకుండా తన కోసం చాలా కాలం ఓపిగ్గా ఎదురుచూశారని, అందుకే చిత్ర బృందానికి ఎప్పటికీ కృతజ్ఞతుడనై ఉంటానని శివరాజ్‌కుమార్ ఎమోషనల్ అయ్యారు. కాగా.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.






