- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షూటింగ్ సెట్‌లో రామ్ చరణ్ అలా చేసేవాడు.. కాజల్ ఆసక్తికర కామెంట్స్
నేను రామ్ చరణ్‌తో కలిసి ఒకటి కాదు, ఏకంగా నాలుగు సినిమాలు మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే, ఎవడు చేశాను.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించిన కాజల్.. పెళ్ళి చేసుకుని ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ‘రామాయణ’, ‘ది ఇండియన్ స్టోరీ’ వంటి భారీ ప్రాజెక్ట్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో, తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్.. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘మగధీర’ సినిమా షూటింగ్ విశేషాలను పంచుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ కాంబినేషన్‌లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రం అప్పట్లో టాలీవుడ్ చరిత్రను తిరగరాసింది. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా గురించి కాజల్ మాట్లాడుతూ.. "నేను రామ్ చరణ్‌తో కలిసి ఒకటి కాదు, ఏకంగా నాలుగు సినిమాలు మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే, ఎవడు చేశాను.
మా కాంబోలో వచ్చిన ‘మగధీర’ మూవీతోనే నేను ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయాను" అని గుర్తుచేసుకుంది. షూటింగ్ విశేషాలను చెప్తూ.. "ఆ సినిమాలో ఒక యుద్ధ సన్నివేశం కోసం రామ్ చరణ్ తన సొంత గుర్రం ‘బాదల్’ను సెట్స్‌కు తీసుకువచ్చేవాడు. ఆ గుర్రాన్ని పిలుస్తున్నట్లు నటిస్తూ నన్ను ఎప్పుడూ సరదాగా ఆటపట్టిస్తూ ఉండేవాడు. చరణ్‌కు కొత్త, పాత, చిన్న, పెద్ద అనే తేడాలు అస్సలు ఉండవు. సెట్‌లో ప్రతి ఒక్కరినీ ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. తెరపైనే కాకుండా, తెరవెనుక కూడా చరణ్ ఎంతో వినయంగా, ఒద్దికగా ఉంటాడు" అని ప్రశంసించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెం. 150’ సినిమాలో నటించిన అనుభవాన్ని కూడా కాజల్ ఈ సందర్భంగా పంచుకుంది. "చిరంజీవి గారితో కూడా పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను.. తండ్రీకొడుకులు ఇద్దరూ క్రమశిక్షణలో, మంచి వ్యక్తిత్వంలో సేమ్ టు సేమ్ ‘డబుల్ యాక్షన్’లా ఉంటారు. ఇద్దరికీ నటన పట్ల, తోటి నటీనటుల పట్ల ఎంతో గౌరవం ఉంటుంది" అంటూ మెగా హీరోల గొప్పతనాన్ని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.






