'మన శంకరవరప్రసాద్ గారు' టికెట్ కొన్న బీజేపీ లీడ‌ర్‌..రూ.1.11 లక్షలు పెట్టి మ‌రీ

by velandi.Saikiran |   (  Updated:2026-01-07 04:28:19  IST  )

చిరంజీవి నటించిన ఈ మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్ షో మొదటి టికెట్ 1.11 లక్షలకు సేల్ అయింది. ఈ స్థాయిలో ధర పెట్టి కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో కాదు అతనే మోకా సుబ్బారావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ వెంకటరమణ థియేటర్ వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ సినిమా టికెట్ వేలం జరిగింది. ఇందులో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు పాల్గొని టికెట్ గెలుచుకున్నారు.

మన శంకరవరప్రసాద్ గారు టికెట్ కొన్న బీజేపీ లీడ‌ర్‌..రూ.1.11 లక్షలు పెట్టి మ‌రీ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఇప్పటి నుంచే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా టికెట్ల కోసం కొంత మంది వేలంపాట నిర్వహిస్తుంటే, మరి కొంత మంది భారీ రేటు పెట్టి మరి కొనుగోలు చేస్తున్నారు.

తాజాగా చిరంజీవి నటించిన ఈ మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్ షో మొదటి టికెట్ 1.11 లక్షలకు సేల్ అయింది. ఈ స్థాయిలో ధర పెట్టి కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో కాదు అతనే మోకా సుబ్బారావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ వెంకటరమణ థియేటర్ వద్ద చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ సినిమా టికెట్ వేలం జరిగింది. ఇందులో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు పాల్గొని టికెట్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా నగదును చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు అందజేస్తున్నట్లు మోకా సుబ్బారావు ప్ర‌క‌ట‌న చేశారు.

Read More..

Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి సినిమా టికెట్ ధర రూ.1.02 లక్షలు

Next Story