Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి సినిమా టికెట్ ధర రూ.1.02 లక్షలు

by velandi.Saikiran |

చిరంజీవి న‌టించిన‌ 'మన శంకర వరప్రసాద్ గారు' బెనిఫిట్ షో మొదటి టికెట్ ధర రూ.1.02 ల‌క్ష‌లు ప‌లికింది. రూ.1.02 ల‌క్ష‌ల‌కు బెనిఫిట్ షో మొదటి టికెట్ దక్కించుకున్నారు చిరంజీవి అభిమాని చాగంటి గణేశ్.

Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి సినిమా టికెట్ ధర రూ.1.02 లక్షలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై భారీగా అంచ‌నాలు పెరిగిపోయాయి. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ల కోసం జ‌నాలు ఎగ‌బ‌డుతున్నారు. ఈ త‌రుణంలోనే చిరంజీవి న‌టించిన‌ 'మన శంకర వరప్రసాద్ గారు' బెనిఫిట్ షో మొదటి టికెట్ ధర రూ.1.02 ల‌క్ష‌లు ప‌లికింది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' బెన్‌ఫిట్ షో టికెట్ వేలం నిర్వ‌హించారు.

ఈ త‌రుణంలోనే రూ.1.02 ల‌క్ష‌ల‌కు బెనిఫిట్ షో మొదటి టికెట్ దక్కించుకున్నారు చిరంజీవి అభిమాని చాగంటి గణేశ్. అనంతరం నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీఎం ఎస్ చైర్మన్ చాగంటి మురళీ కృష్ణ కేక్ కట్ చేసి మెగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. కాగా చిరంజీవి న‌టించిన 'మన శంకర వరప్రసాద్ గారు సినిమా జ‌న‌వ‌రి 12వ తేదీన రిలీజ్ కానుంది.

Next Story