- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంకీ మామ దూకుడు..దృశ్యం 3 పై అదిరిపోయే అప్డేట్ !
విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ చేయబోయే సినిమా దృశ్యం 3. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ మాసంలో ప్రారంభం కానున్నట్లు నిర్మాత సురేష్ బాబు తాజాగా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: వెంకీ మామ యమ దూకుడుగా ఉన్నారు. గత సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేష్... ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో మెరిసి సందడి చేశారు. అలాగే త్రివిక్రమ్ తో కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే వెంకి మామ తర్వాతి సినిమాపై కూడా మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే దృశ్యం, దృశ్యం 2 సినిమాలతో బంపర్ హిట్ అందుకున్నాడు వెంకటేష్. డబ్బింగ్ సినిమాలు అయినప్పటికీ ఈ రెండు సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు దృశ్యం 3 రాబోతుంది.
దృశ్యం 3 పై సురేష్ బాబు కీలక ప్రకటన
విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ చేయబోయే సినిమా దృశ్యం 3. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ మాసంలో ప్రారంభం కానున్నట్లు నిర్మాత సురేష్ బాబు తాజాగా ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దృశ్యం 3 మలయాళ సినిమా షూటింగ్ జరుగుతోంది. మోహన్ లాల్ హీరోగా చేస్తున్న ఈ సినిమా 2026 సమ్మర్ లో రిలీజ్ కానుందట. ఇక ఇటు త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నాడు వెంకటేష్. ఈ మూవీ ఈ వేసవిలోనే రిలీజ్ కానుంది. ఆదర్శ కుటుంబం సినిమా షెడ్యూల్ పూర్తయిన తర్వాత.. దృశ్యం 3 మూవీ కోసం వెంకటేష్ సిద్ధం కాబోతున్నాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Read More..






