బెస్ట్ కం బ్యాక్ ఇవ్వడం కోసం మెగా హీరోతో మారుతి సినిమా..?

by I. Sairam |   (  Updated:2026-01-21 06:17:28  IST  )

‘రాజా సాబ్’(Raja Saab) మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న డైరెక్టర్ మారుతి(Maruti) ప్రజెంట్ బెస్ట్ కం బ్యాక్ ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నాడట.

బెస్ట్ కం బ్యాక్ ఇవ్వడం కోసం మెగా హీరోతో మారుతి సినిమా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘రాజా సాబ్’(Raja Saab) మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న డైరెక్టర్ మారుతి(Maruti) ప్రజెంట్ బెస్ట్ కం బ్యాక్ ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నాడట. ఇందుకోసం మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌(Varun Tej)తో ఓ మూవీ తెరకెక్కించనున్నాడట. ఇది మారుతి స్టైల్‌లో సింపుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని బన్నీ వాస్(Bunny Vas), ఎస్‌కెఎన్(SKN) సంయుక్తంగా నిర్మించనున్నారట.

కాగా ప్రజెంట్ వరుణ్ తేజ్.. మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) డైరెక్షన్‌లో ‘కొరియన్ కనకరాజు’(Korean Kanakaraju) అనే సినిమాలో నటిస్తున్నాడు. దీన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ రితికా నాయక్(Rithika Nayak) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవ్వగా.. తాజాగా విడుదల చేసిన టైటిల్ రివీల్ గ్లింప్స్ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగేలా చేశాయి. ఇక ఈ సినిమా సమ్మర్‌లో రిలీజ్ కానుంది.

Read More..

ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వరుణ్ ధావన్.. నా పనే సమాధానం చెబుతుందంటూ కామెంట్స్

Next Story