ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వరుణ్ ధావన్.. నా పనే సమాధానం చెబుతుందంటూ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-21 03:57:47  IST  )

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) భారీ అంచనాల మధ్య రూపొందుతున్న యుద్ధ ప్రాతిపదిక చిత్రం 'బోర్డర్ 2' (Border 2)లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వరుణ్ ధావన్.. నా పనే సమాధానం చెబుతుందంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) భారీ అంచనాల మధ్య రూపొందుతున్న యుద్ధ ప్రాతిపదిక చిత్రం 'బోర్డర్ 2' (Border 2) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల విడుదలైన ‘ఘర్ కబ్ ఆవోగే’ పాటలో వరుణ్ నటన ఆయన చిరునవ్వుపై నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, 'బ్రేవ్స్ ఆఫ్ ద సాయిల్' ట్రిబ్యూట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న వరుణ్ తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారం, ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించారు. ‘‘బయట జరిగే అనవసరపు శబ్దాలను పట్టించుకోకుండా, మన పని ద్వారానే సమాధానం చెప్పాలని నేను నమ్ముతాను. ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నేను దేనికోసం కష్టపడ్డానో ఈ శుక్రవారం మీకే తెలుస్తుంది. ట్రోల్ చేసే వారికి నా పనే సమాధానం చెబుతుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.

బాక్సాఫీస్ నంబర్లతో తనకు సంబంధం లేదని, ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడమే తన లక్ష్యమని వరుణ్ స్పష్టం చేశారు. ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోయి కేవలం వినోదాన్ని కోరుకుంటారు. మేము ఒక అద్భుతమైన సినిమా తీశామని నేను నమ్ముతున్నాను అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ ‘బోర్డర్’కు సీక్వెల్‌గా రాబోతుండగా... ఇందులో సన్నీ డియోల్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. జేపీ దత్తా, నిధి దత్తా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Read More..

మెగా-158లో కథానాయికగా అలనాటి హీరోయిన్.. పోస్ట్ వైరల్

Next Story