ముంబైలో ‘డ్రాగన్’ గ్లింప్స్ లాంచ్.. ఫ్యాన్స్‌లో అయోమయం!

by Chukka Sudharani |   (  Updated:2026-05-15 15:42:27  IST  )

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘NTRNeel’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు.

ముంబైలో ‘డ్రాగన్’ గ్లింప్స్ లాంచ్.. ఫ్యాన్స్‌లో అయోమయం!
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘NTRNeel’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు సంబంధించిన తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతున్నది. ‘NTR పుట్టినరోజు సందర్భంగా మే 19 అర్ధరాత్రి NTRNeel ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. ఈ టీజర్ లాంచ్ కోసం తారక్ ముంబైకి వెళ్లనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ తర్వాత ఈ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో నార్త్ మార్కెట్‌లో కూడా మంచి హైప్ ఉంది. అందుకే మేకర్స్ ముంబైలో నేషనల్ మీడియా సమక్షంలో గ్రాండ్‌గా ప్రమోషన్స్ ప్రారంభించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది’ అంటూ ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా.. భారీ అంచనాల మధ్య ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ చిత్రాన్ని డ్రాగన్ పేరు పరిశీలనలో ఉండగా.. దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.

Janhvi Kapoor : పెద్ది ప్రమోషన్స్‌కు దూరంగా జాన్వీ

Next Story