- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫంకీలో విశ్వక్ చెల్లెలుగా నటించిందెవరో తెలుసా.. మామూలు బ్యాక్‌గ్రౌండ్ కాదు.
'ఫంకీ'లో విశ్వక్‍కు చెల్లెలుగా నటించిన అమ్మాయి పేరు అదితి భావరాజు. ఈమె ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తెలుగు ఇండియన్ ఐడల్ షోలో పాల్గొని టాప్ 5లో నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్ : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా ఫంకీ అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ లో హీరోగా నటించాడు. డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుదీప్ కేవి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నరేష్, ఈశ్వరీరావు, సంపత్ రాజ్, వీటీవీ గణేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ లో విశ్వక్ కి సోదరిగా అదితీ భావరాజు కనిపించింది.
ఈమె కొంతకాలం క్రితం విడుదల అయ్యి మంచి ప్రశంసలు పొందిన దండోరా సినిమాలో కూడా ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈమెకు ఫంకీ చిత్రం రెండవది. అదితీకి వరుసగా మంచి అవకాశాలు వస్తూ ఉండడంతో ఈ ముద్దుగుమ్మ ఎవరనేది తెలుసుకోవడంపై జనాలు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరి ఈ బ్యూటీ ఎవరు అనేది తెలుసుకుందాం.. తెలుగు సంగీత ప్రేక్షకులకు అదితి భావరాజు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ టాలెంట్ షోలో అదితి భావరాజు కంటెస్టెంట్.
ఈమె ఈ షోలో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి టాప్ 5లో నిలిచింది. తెలుగు ఇండియన్ ఐడల్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్నది ఆ తర్వాత సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా కూడా పని చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ నటి దాదాపు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన అందరు సంగీత దర్శకుల దగ్గర పని చేసింది. సంగీతం ద్వారా క్రేజ్ ను సంపాదించుకున్న అదితి భావరాజు ప్రస్తుతం నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది.






