మహేష్ 'మిస్టర్ పర్‌ఫెక్ట్' ప్రభాస్ చేతికి ఎలా వచ్చిందో తెలుసా.. మామూలు కథ కాదు

by Pulgam srinivas |   (  Updated:2026-04-19 17:24:49  IST  )

మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అనే టైటిల్‌తో సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఆ సినిమా ఆగిపోవడంతో, తర్వాత ప్రభాస్ సినిమాకు ఆ టైటిల్‌ను సెట్ చేసినట్లు తెలుస్తోంది.

మహేష్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ప్రభాస్ చేతికి ఎలా వచ్చిందో తెలుసా.. మామూలు కథ కాదు
X

దిశ, వెబ్ డెస్క్: మిస్టర్ పర్‌ఫెక్ట్ టైటిల్‌ను మహేష్ బాబు సినిమా కోసం అనుకున్నారు. మరి అది ప్రభాస్ సినిమాకు ఎలా వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం. 2009వ సంవత్సరంలో ‘కిక్’ సినిమా విడుదలై బ్లాక్‌బస్టర్ అయిన తర్వాత సురేందర్ రెడ్డి, మహేష్ బాబుతో ఓ సినిమాను చేయాలని అనుకున్నాడు. అందులో భాగంగా ‘ఖలేజా’ సినిమా సెట్‌కు వెళ్లి ఆయనకు స్టోరీని వినిపించాడు. అది బాగా నచ్చడంతో, అంతకుముందు ‘అతిధి’తో తనకు ఫ్లాప్ ఇచ్చిన విషయాన్ని పట్టించుకోకుండా సురేందర్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చాడు.

ఇక ఆర్ఆర్ ఫిలిం మేకర్స్ బ్యానర్ వారు ఆ చిత్రాన్ని ఆ సమయంలోనే 40 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇక టైటిల్‌గా ‘మిస్టర్ పర్ఫెక్ట్’ను ఖరారు చేసుకున్నారు. ‘ఖలేజా’ విడుదలైన వెంటనే దీనిని ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. అంతా ఓకే అయ్యి, మరికొన్ని రోజుల్లో సినిమా స్టార్ట్ అవుతుంది అనుకునే సమయంలో కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా ఆర్ఆర్ నిర్మాణ సంస్థ భారీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. సినిమా స్టార్ట్ చేయడం కాదు కదా, కనీసం ప్రీ-ప్రొడక్షన్ పనులకు కూడా వారి దగ్గర డబ్బులు లేని స్థితికి వెళ్లిపోయారు.

దాంతో సినిమా ఆగిపోయింది. అదే సమయంలో ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. దానికి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే టైటిల్ అయితే బాగుంటుందని వారు అనుకున్నారు. ఆ టైటిల్ ఆర్ఆర్ ఫిలిం మేకర్స్ దగ్గర ఉందని తెలియడంతో ప్రభాస్ ప్రత్యేకంగా వారికి ఫోన్ చేసి టైటిల్ గురించి అడగగా, వారు దానిని మహేష్ బాబుకు ఇవ్వాలని అనుకున్నప్పటికీ చివరికి ప్రభాస్ సినిమాకు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇలా మహేష్ బాబు కోసం అనుకున్న ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ టైటిల్ ప్రభాస్ సినిమాకు వచ్చినట్లు తెలుస్తోంది.

Read More.. ఈ ఏడాది లేనట్టేనా?.. ప్రభాస్ ఫ్యాన్స్ బిగ్ బ్యాడ్ న్యూస్

Next Story