- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ ఏడాది లేనట్టేనా?.. ప్రభాస్ ఫ్యాన్స్ బిగ్ బ్యాడ్ న్యూస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ సీక్వెల్‌పై కీలక అప్డేట్ వచ్చింది.

దిశ, సినిమా: డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సీక్వెల్స్‌లో ‘సలార్ 2’ ఒకటి. మొన్నటి వరకు ఈ ఏడాది చివరిలో ఈ సీక్వెల్‌కు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుందని వార్తలు రాగా.. ఇప్పుడు షూటింగ్ ఆగిపోయే పరిణామాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూనియర్ఎన్టీఆర్‌తో ‘NTRNeel’ పై దృష్టి సారించగా.. ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ 2026 చివరి నాటికి తమ ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేస్తారని భావిస్తున్నారు. అన్నీ షెడ్యూల్ ప్రకారం జరిగితే, ఆ తర్వాత వెంటనే చిత్ర బృందం ‘సలార్’ చిత్రీకరణను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే.. ఇది పూర్తి అయ్యే సరికి ఈ ఏడాది కంప్లీట్ అవుతాది కాబట్టి.. ఈ సీక్వెల్ బహుశా 2027 ప్రారంభంలో షూటింగ్ మొదలవ్వచ్చని తెలుస్తుంది. సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్‌కు లభించిన బలమైన స్పందన నేపథ్యంలో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.






