తెలుసు కదా ఇది ముగింపు మాత్రమే కాదని.. వైరల్‌గా దిశా పటాని పోస్టులు

by Chukka Sudharani |   (  Updated:2026-06-07 10:29:18  IST  )

బీటౌన్ యంగ్ బ్యూటీ దిశా పటాని, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆవారాపన్ 2’.

తెలుసు కదా ఇది ముగింపు మాత్రమే కాదని.. వైరల్‌గా దిశా పటాని పోస్టులు
X

దిశ, సినిమా: బీటౌన్ యంగ్ బ్యూటీ దిశా పటాని, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆవారాపన్ 2’. 2007లో విడుదలై కల్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘ఆవారాపన్’ చిత్రానికి సీక్వల్‌గా వస్తున్న ఈ ప్రాజెక్టుపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ‘ఆవారాపన్ 2’ ఫస్ట్ లుక్ టీజర్ జూలై 1న విడుదల కానున్నట్లు బాలీవుడ్ ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. ఈ టీజర్ దిశ, ఇమ్రాన్ మధ్య ఉండబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ చేసిన దిశ.. సోషల్ మీడియాలో అదిరిపోయే పోస్టులతో కుర్రకారుని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కాగా.. ‘అభిమానులకు తెలుసు ఇది కేవలం ముగింపు మాత్రమే కాదని.. అతను మీ కోసమే మళ్లీ తిరిగి వచ్చాడు’ అంటూ మేకర్స్ ఇటీవల రిలీజ్ చేసిన ‘ఆవారాపన్ 2’ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమాపై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌ను విశేష్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న దివి.. అయినా గ్లామర్ డోస్ మాత్రం తగ్గట్లేదు

Next Story