Ap: వందేభారత్ రైలుకు ప్రమాదం

by Vemula.Srinu Prasad |

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది...

Ap: వందేభారత్ రైలుకు ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai District) హిందూపురం రైల్వే స్టేషన్(Hindupuram Railway Station) సమీపంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express)కు ప్రమాదం తప్పింది. కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్తుండగా రైల్వే ట్రాక్‌పైకి ఒక్కసారిగా గేదె అడ్డు రావడంతో రైలు దాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర సంఘటనతో రైలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం

ఈ ప్రమాదం కారణంగా వందేభారత్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు ప్రారంభించారు. ఇంజిన్ దెబ్బతినడంతో రైలును ముందుకు కదిలించడం సిబ్బందికి సవాలుగా మారింది.

ఊహించని ఘటనతో...

ఈ ఊహించని ఘటనతో బెంగళూరు మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన మార్గంలో రైలు నిలిచిపోవడంతో వెనుక వచ్చే రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారు. రైల్వే రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Next Story