- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి సీతక్క
పలు సంఘటనల ద్వారా మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) ఆదివారం పరామర్శించారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : పలు సంఘటనల ద్వారా మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) ఆదివారం పరామర్శించారు. ఆదివారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న కుర్సం అశోక్ కుమారుడు కుర్సం హర్షవర్ధన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ములుగు మండలం పంచోత్కులపల్లి గ్రామానికి చెందిన ఆగబోయిన నిరోష వడదెబ్బతో మృతి చెందగా, ఆమె కుమారులు రిషి, అభి అనాథలయ్యారు. 2019లో తండ్రి శోభన్ కూడా మృతి చెందడంతో చిన్నారులు దిక్కులేని స్థితిలో ఉన్నారు. చిన్నారులను పరామర్శించిన మంత్రి 25 వేల ఆర్థిక సహాయం అందించారు. మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున సహాయం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగా కళ్యాణి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






