- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోడు సమస్యలకు పరిష్కారం ఏది..?
కొమురం ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ పోడు భూముల లొల్లి మొదలైంది.

దిశ, ఆసిఫాబాద్: కొమురం ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ పోడు భూముల లొల్లి మొదలైంది. జిల్లాలోని తూర్పు సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో పోడు భూముల వ్యవహారం అడవి శాఖ అధికారులు పోడుదారుల మధ్య వివాదంగా మారుతుంది. తమ తాతల కాలం నుంచి ఈ భూములను సాగు చేసుకుంటున్నామని.. పట్టాలు ఉన్న ఫారెస్ట్ అధికారులు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని పోడుదారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని చాలా మండలాల్లో పోడు భూముల వివాదాలు కొన్నేళ్లుగా కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంతరించి పోతున్న అడవులను సంరక్షించాలనే లక్ష్యంతో అడవి శాఖలో అప్పటి ప్రభుత్వం భారీ స్థాయిలో అడవిశాఖలో అధికారుల నియామకం చేపట్టింది. కొత్తగా వచ్చిన అధికారులు జిల్లా అధికారుల ఆదేశాలు మేరకు అడవి భూముల అన్యక్రాంతం కాకుండా అటవీ సరిహద్దులను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అప్పటికే చాలా చోట్ల వందలాది ఎకరాల్లో రైతులు పోడు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అడవి శాఖ అధికారులు తమ పరిధిలోని భూములు సాగు చేయవద్దని పోడుదారులను అడ్డుకోవడంతో ఈ వివాదం తలెత్తునట్టు తెలుస్తుంది.
ఏటా పోడు వివాదం...
జిల్లాలో 28 వేల 14 మంది సుమారు 93 వేల 467 ఎకరాల అడవి భూములను ఏళ్లుగా ఏజెన్సీ మైదాన ప్రాంతాలలో పోడు సాగు చేస్తూ జీవిస్తున్నట్టు అడవి శాఖ అధికారులు తెలుపుతున్నారు. అయితే ప్రతిఏటా ఖరీఫ్ సీజన్ సాగు సమయంలో పోడుదారుల వివాదం ముదురుతోంది. గత కొన్నేళ్లుగా అటవీ శాఖ అధికారులు పదుల సంఖ్యలో పోడు సాగును అడ్డుకుంటున్నారు. ఇటు పోడుదారులు.. అటు ఫారెస్ట్ అధికారుల మధ్య తీవ్ర లొల్లి తలెత్తింది. పోలిస్ స్టేషన్ ల్లో పరస్పర ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైయ్యాయి. అలాగే గత ఏడాది పోడు హక్కుల కోసం రాజ్ సేవా సమితి. గోండ్వానా పంచాయతీ రాజ్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట వారం రోజులు రిలే దీక్షలు చేపట్టగా, అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సీఎం మాట్లాడి పోడు సమస్యలను పరిష్కరిస్తా మని ఆందోళనకారులతో ఫోన్ లో మాట్లాడి దీక్ష విరమింపజేశారు. ఆ తర్వాత సుమారు 62 దిందా రైతులు పోడు భూముల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డి కలిసెందుకు కాలినడకన పాదయాత్రగా వెళ్లిన రైతులను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేసి జిల్లాకు తరలిస్తున్నారు. తాజాగా శనివారం బెజ్జుర్ మండలంలోని రెబ్బన గ్రామ శివారులో ట్రాక్టర్లతో కందకాలు తవ్వడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులను రైతులు అడ్డుకున్నారు. అలాగే పెంచి కాల్ పేట్ దర్గపల్లి శివారులో పోడు భూమిను ట్రాక్టర్లతో చదును పనులు చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు.
హక్కు పత్రాలు ఇస్తేనే..
రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగు అధికంగా ఉన్న జిల్లాలలో కొమురం భీం జిల్లా ఒకటి. పార్టీలు ఇక్కడి రాజకీయ నాయకులు పోడు రైతుల సమస్యలను ఎన్నికల్లో ప్రచార అస్త్రాలుగా వినియోగించుకుంటున్నాయి. ఎన్నికల అనంతరం రాష్ట్రస్థాయి పోడు రైతులకు అనుకూలంగా ప్రకటనలు చేసిన.. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. రైతులను తరచూ అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో అప్పటి ప్రభుత్వం అడవి హక్కుల చట్టాల ప్రకారం పోడు రైతులకు అడవి హక్కు పత్రాలను అందజేసింది. ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయిలో పట్టాలను అందించాలని పోడు రైతులు కోరుతున్నారు.






