- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంతపురం జిల్లాలో భారీ వర్షం.. వేదవతి నదికి పోటెత్తిన వరద నీరు
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించడంతో పలుచోట్ల వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా వర్షం పడుతోంది. ..

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోకి నైరుతీ రుతుపవనాలు(Southwest monsoon) ప్రవేశించడంతో పలుచోట్ల వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా వర్షం(Rain) పడుతోంది. ఇంతకాలం ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయినప్పటికీ ఈ రుతుపవనాల రాకతో ఉపశమనం కలుగుతోంది. కాకపోతే భారీగా వర్షాలు కురుస్తుండటంతో పలుచోట్ల ఇబ్బందులు తప్పడంలేదు. ఆదివారం అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాయదుర్గం నియజకవర్గంలోని బొమ్మనహాల్, డి.హీరేహల్, కనేకల్ మండలాల్లో కురిసిన వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు వేదవతి హగరి నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story






